![]() |
![]() |

జాతిరత్నాలు ఫేమ్ చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా సంతోష్ శోభన్ సరసన లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మూవీలో నటిస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 4 న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ టైములో మూవీ ప్రొమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆలీతో సరదాగా షోకి వచ్చి వీళ్ళిద్దరూ ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో విషయాలు చెప్పారు. ఫారియా మాట్లాడుతూ " విజయ్ ఆంథోనీతో తమిళ్ లో ఒక చిత్రం, రవితేజతో రావణాసుర మూవీ, హిందీలో ఒక వెబ్ సిరీస్ , అటు తమిళనాడులో, ఇటు మహారాష్ట్రలో, ఇంకో వైపు మలయాళీ, బెంగాలీ అన్ని వైపులా నా నటన ప్రస్థానాన్ని విస్తరిస్తున్న.. నేను పుట్టింది హైదరాబాద్ లో. మా నాన్న ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. ఇంతకు ముందు ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూసుకునేవారు. ఇంట్లో నేను, చెల్లి ఉంటాం. జాతిరత్నాలులో నా పేరు చిట్టి కదా..ఆ పేరుతోనే అందరూ పిలుస్తారు. ఒక రోజు నేను క్యాబ్ లో మాస్క్ వేసుకుని వచ్చేటప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ తన చిన్నప్పటి క్రష్ గురించి చెప్పాడు. ఆ పిల్ల పేరు కూడా చిట్టి అంట. అతను అలా చెప్పేసరికి నా పేరు కూడా చిట్టి అని చెప్పా.
డ్రైవింగ్ చేస్తున్నవాడల్లా ఒక్కసారి వెనక్కి చూసి మీ పేరు చిట్టినా ఏ స్కూల్ అని అడిగాడు. నేను షాకయ్యా. తర్వాత అతను నాతో ఒక సెల్ఫీ తీసుకున్నాడు. జాతిరత్నాలు చేసాక ఆ బ్రేక్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ లో ఒక క్యారెక్టర్ చేశా, బంగార్రాజు లో ఒక సాంగ్ చేసాను. అలాగే ఎన్నో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసాను. అలాగే ఈవెంట్స్ కి ఆర్గనైజర్ గా కూడా చేసాను. బంగార్రాజులో పాట నాకు నచ్చింది. అందులోనూ నాగార్జున గారు ఉన్నారు అందుకే ఆ సాంగ్ చేసాను. " అంటూ ఫారియా అబ్దుల్లా ఎన్నో విషయాలు చెప్పింది.
![]() |
![]() |